Home > తెలంగాణ > అభ్యర్థుల ఎంపికపై స్పీడ్ పెంచిన కాంగ్రెస్.. ఇవాళ పీఈసీ భేటీ

అభ్యర్థుల ఎంపికపై స్పీడ్ పెంచిన కాంగ్రెస్.. ఇవాళ పీఈసీ భేటీ

అభ్యర్థుల ఎంపికపై స్పీడ్ పెంచిన కాంగ్రెస్.. ఇవాళ పీఈసీ భేటీ
X

తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతుండడంతో పార్టీలు జోరు పెంచాయి. బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన కాంగ్రెస్.. దానిని వడపోసే పనిలో నిమగ్నమైంది. ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. రేవంత్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది.

ఆశావాహుల దరఖాస్తులను కమిటీ పరిశీలించనుంది. అందులో నుంచి కొన్నింటిని వడపోయనుంది. మొదటి పీఈసీ సమావేశంలోనే ఈ ప్రక్రియ జరగాల్సి ఉన్నప్పటికీ... దరఖాస్తుదారుల వివరాలు అందుబాటులో లేక వాయిదా వేశారు. ప్రస్తుతం దరఖాస్తుదారుల సంక్షిప్త సమాచారంతో పీఈసీ బుక్‌లెట్‌ను సిద్ధం చేసింది. ఇవాళ్టి మీటింగ్లో దరఖాస్తులను వడపోసి తయారు చేసిన జాబితాను స్క్రీనింగ్ కమిటీకి అందజేస్తారు.

ఈ నెల 4 నుంచి టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. 4న పీఈసీ సభ్యులతో స్క్రీనింగ్ కమిటీ భేటీ అవుతోంది. 5న డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులతో స్క్రీనింగ్ కమిటీ ముఖాముఖిగా మాట్లాడుతుంది. ఆ తర్వాత పీఈసీ జాబితాను నిశితంగా పరిశీలించి నియోజకవర్గానికి ఒకటి లేదా రెండు పేర్లతో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి నివేదిక పంపుతారు. అయితే సింగిల్ నేమ్తో ఉండే నియోజకవర్గ అభ్యర్థులను స్క్రీనింగ్ కమిటీ స్థాయిలోనే ప్రకటిస్తారని సమాచారం.

Updated : 3 Sep 2023 7:46 AM GMT
Tags:    
Next Story
Share it
Top