Home > తెలంగాణ > Breaking News : బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన పెద్దపల్లి ఎంపీ

Breaking News : బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన పెద్దపల్లి ఎంపీ

Breaking News  : బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన పెద్దపల్లి ఎంపీ
X

పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమక్షంలో ఆయన హస్తం కండువా కప్పుకున్నారు. ఎంపీతో పాటు మరికొంతమంది కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆయన కేసీ వేణుగోపాల్ను కలిశారు. కాగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ తరుపున చెన్నూరు నుంచి పోటీ చేసి బాల్కసుమన్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుపున పెద్దపల్లి నుంచి పోటీ చేసి గెలిచారు.






Updated : 6 Feb 2024 11:26 AM IST
Tags:    
Next Story
Share it
Top