నిర్మల్లో చిరుత కలకలం.. భయాందోళనలో ప్రజలు
X
నిర్మల్ పట్టణంలో చిరుత కలకలం రేపింది. విశ్వనాథ్ పేట్ నుంచి బంగల్పేట్ వెళ్లే దారిలో పంట పొలాల సమీపంలో స్థానికులకు చిరుత కనిపించింది. వెంటనే వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు ఘటనాస్థలికి చేరుకుని చిరుత పాదముద్రలు సేకరించారు. చిరుత ఏ వైపు వెళ్లిందనే దానిపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక చిరుతను త్వరగా పట్టుకోవాలని అధికారులకు ప్రజలు విజ్ఞప్తి చేశారు.
అటు తిరుమలలోనూ చిరుతలు భయాందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే చిరుత దాడిలో ఓ చిన్నారి మృతిచెందడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు ఆపరేషన్ చిరుత మొదలుపెట్టారు. గత మూడురోజుల్లో రెండు చిరుతలను పట్టుకున్నారు. మిగితావాటిని కూడా పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీన్ని కోసం పలుచోట్ల బోన్లు ఏర్పాటు చేశారు. మరోవైపు మధ్యాహ్నం 2గంటల తర్వాత పిల్లలకు అనుమతి లేదని టీటీడీ స్పష్టం చేసింద. చిరుతల సంచారం నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది