Home > తెలంగాణ > ‘మా కోసం ఏం చేయలే.. మా గ్రామంలోకి రావద్దు’.. జీవన్ రెడ్డికి నిరసన సెగ

‘మా కోసం ఏం చేయలే.. మా గ్రామంలోకి రావద్దు’.. జీవన్ రెడ్డికి నిరసన సెగ

‘మా కోసం ఏం చేయలే.. మా గ్రామంలోకి రావద్దు’.. జీవన్ రెడ్డికి నిరసన సెగ
X

ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డికి ప్రజల నుంచి నిరసన సెగ ఎదురైంది. అభివృద్ధిపై ప్రశ్నలు అడుగుతూ ఆయకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు పెట్టారు. నందిపేట మండలం తల్వెద గ్రామంలో పర్యటనకు వెళ్లిన జీవన్ రెడ్డికి ఈ చేదు అనుభవం ఎదురైంది. ఆయన చేసిన అభివృద్ధిని ప్రశ్నిస్తూ గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు దర్శనం ఇచ్చాయి. ‘ప్రజలు నాయకుడి దగ్గర అడుక్కోకూడదు. అడగాలి, ప్రశ్నించాలి, నిలదీయాలి’అంటూ ఫ్లెక్సీలు కట్టారు. తమ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని, అందుకే తమ గ్రామాల్లోకి రావొద్దంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

ఫ్లెక్సీలో ఉన్న ప్రశ్నలు ఇవే..

1. రైతులకు రుణమాఫీ ఎక్కడ?

2. మా ఊరిలో దళిత బంధు లేదా?

3. బీసీ బందు అందరికీ ఎప్పుడు?

4. పేద కుటుంబాలకు డబుల్ బెడ్రూంలు ఎటుపాయే?

5. మన ఊరు మనబడి అంటివి పేద పిల్లల ఉసురుపోసుకుంటివి?

6. కొత్త బీడీ పింఛన్లు యాడికి పోయే?

7. కొత్త రేషన్ కార్డులు కొత్త పేర్లు నమోదు ప్రక్రియ యాడికి పోయే?




Updated : 20 Jun 2023 7:43 PM IST
Tags:    
Next Story
Share it
Top