Home > తెలంగాణ > 'ఆ పుంజు నాది'.. కరీంనగర్ కోడి పుంజు వేలంలో ట్విస్ట్

'ఆ పుంజు నాది'.. కరీంనగర్ కోడి పుంజు వేలంలో ట్విస్ట్

ఆ పుంజు నాది.. కరీంనగర్ కోడి పుంజు వేలంలో ట్విస్ట్
X

గత 4 రోజులుగా కరీంనగర్ బస్టాండ్ రెండో డిపోలో ఓ కోడిపుంజు బందీగా ఉన్న విషయం తెలిసిందే. వరంగల్ నుండి వేములవాడకు వెళ్ళే ఆర్టీసీ బస్సులో పుంజు లభ్యమైంది. కరీంనగర్ బస్టాండుకు వచ్చిన తరువాత బస్సులో ఓ సంచిలో కోడిపుంజు గుర్తించిన డ్రైవర్... సంచీలో కోడిపుంజు ఉండటంతో కంట్రోలర్ కు అప్పగించారు. ఆ కోడి మంచి దిట్టంగా ఉండటంతో సుమారు 6 కిలోలు ఉండోచ్చని అంచనా వేశారు. గత 4 రోజులుగా డిపోలో ఓ జాలీలో పుంజును ఉంచి అధికారులు సంరక్షిస్తున్నారు. పుంజు కోసం ఎవరూ రాకపోవడంతో ఈరోజు(శుక్రవారం)మధ్యాహ్నం 3 గంటలకు కోడిపుంజును బహిరంగ వేలం వేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఈ క్రమంలో ఆ పుంజు తనదేనంటూ ఓ వ్యక్తి సోషల్ మీడియా వేదికగా వీడియో రిలీజ్ చేశాడు. ఆ కోడి పుంజు తనదేనని కోడి పందాల కోసం పుంజును సాకుతున్నానని వీడియోలో తెలిపాడు. తన పుంజు తనకు ఇవ్వాలని అధికారులను కోరారు.

ఆర్టీసీ బస్సులో మరిచిపోయిన పందెం కోడి తనదేనని సిరిసిల్ల జిల్లా రుద్రంగికి చెందిన మహేష్ అనే వ్యక్తి ఓ వీడియో రిలీజ్ చేశాడు. తాను నెల్లూరు వాసినని వృత్తి రీత్యా సిరిసిల్లలో ఉంటున్నానని చెప్పాడు. సంక్రాంతికి ఊరికి తీసుకెళ్దామని కోడిని సాకానని తెలిపాడు. ఈనెల 9న కరీంనగర్ నుంచి వరంగల్ వెళ్తుండగా కోడిని సంచిలో పెట్టి మరిచిపోయానని చెప్పాడు. కోడి తనదేనంటూ ఆధారాలను ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో కోడి పుంజు కథలో ట్విస్ట్ ఏర్పడ్డది. ఇప్పుడు అధికారులు ఆ కోడి పుంజును అతనికి ఇస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.




Updated : 13 Jan 2024 7:41 AM IST
Tags:    
Next Story
Share it
Top