Home > తెలంగాణ > Barrelakka: ప్రాణం పోయినా నిరుద్యోగులపై పోరాటం ఆపను: బర్రెలక్క

Barrelakka: ప్రాణం పోయినా నిరుద్యోగులపై పోరాటం ఆపను: బర్రెలక్క

Barrelakka: ప్రాణం పోయినా నిరుద్యోగులపై పోరాటం ఆపను: బర్రెలక్క
X

కొల్లాపూర్ ఇండిపెండెంట్ అభ్యర్థి, సోషల్ మీడియా స్టార్ బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష్ ప్రచారంలో దూసుకుపోతుంది. రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యను ఎత్తి చూపుతూ తీసిన వీడియో ద్వారా ఫేమస్ అయిన శిరీష.. అదే సమస్యపై పోరాడేందుకు ఈసారి ఎన్నికల బరిలో దిగింది. దీంతో అప్పటినుంచి శిరీషకు మద్దుతు పెరుగుతుంది. ఈ క్రమంలో ప్రముఖ అడ్వకేట్లు కావేటి శ్రీనివాస్ రావు, కరణం రాజేశ్ గురువారం శిరీషను కలిసి తమ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన శిరీష ప్రాణం పోయినా పోరాటం ఆపనని స్పష్టం చేసింది శిరీష. నామినేషన్ వేసినప్పటి నుంచి ప్రత్యర్థులు తలను రోజూ ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని, బయటకు చెప్పుకోలేని విధంగా బూతులు తిడుతున్నారని, తనకు సపోర్ట్ ఇస్తున్న వారిని కూడా బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు వాయిస్ గా, లోకల్ ఇష్యూస్ ను హైలైట్ చేసేందుకు, పేదలకు మంచి చేసేందుకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. తనపై దాడులు చేస్తున్న వారి వివరాలు తన దగ్గర ఉన్నాయని, వాటిని ఎన్నికల తర్వాత వెల్లడిస్తానని స్ఫష్టం చేశారు. నిరుద్యోగులకు న్యాయం జరిగేవరకు తన పోరాటం ఆపనని తేల్చిచెప్పారు.

ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీనివాస్.. అంతర్జాతీయ న్యాయవాదుల సంఘం శిరీసకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. శిరీష్ తమ్ముడిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన లాయర్లు.. ఇకపై తనను టచ్ చేయాలంటే.. ముందు లాయర్లను టచ్ చేయాలని సవాల్ విసిరారు. దాడిచేసిన వారి గురించి తెలిసినా పోలీసులు వారిపై ఎందుకు చర్య తీసుకోలేదని ప్రశ్నించారు. శిరీష్ పోటీ చేయడంతో ప్రధాన పార్టీలకు మింగుడు పడటంలేదన్నారు. శిరీష ప్రాణాలకు ముప్పు ఉన్న నేపథ్యంలో 2 ప్లస్ 2 గన్ మెన్లతో భద్రత కల్పించాలి కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు.




Updated : 24 Nov 2023 8:40 AM IST
Tags:    
Next Story
Share it
Top