Home > తెలంగాణ > BRS party : బీఆర్ఎస్ పార్టీకి అక్రమంగా 11 ఎకరాలు..! హైకోర్ట్లో పిటిషన్

BRS party : బీఆర్ఎస్ పార్టీకి అక్రమంగా 11 ఎకరాలు..! హైకోర్ట్లో పిటిషన్

BRS party  : బీఆర్ఎస్ పార్టీకి అక్రమంగా 11 ఎకరాలు..! హైకోర్ట్లో పిటిషన్
X

బీఆర్ఎస్ పార్టీకి అక్రమంగా 11 ఎకరాలు కేటాయించారని అప్పటి ప్రభుత్వంపై హైకోర్ట్ లో పిటిషన్ వేశారు. కోకాపేటలో బీఆర్ఎస్ కు 11 ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వం కేటాయించడాన్ని సవాలు విసురుతూ.. లాయర్ వెంకటరామి రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. కోకాపేటలోని సర్వే నంబర్ 239, 240లను బీఆర్ఎస్ కు కేటాయించడంలో పారదర్శకత, న్యాయబద్ధత జరగలేదని ఆయన పిటిషన్ లో తెలిపారు. ప్రామాణిక టెండర్ ప్రక్రియను అనుసరించకుండా.. బహిరంగంగా చెప్పకుండా భూకేటాయింపు జరిపారని ఆయన ఆరోపించారు.

ఈ భూవి విలువ మార్కెట్ లో రూ.50 కోట్లకు పైగా ఉంటుందని, కానీ రూ.3 కోట్ల 1 లక్షల 25 వేలకే బీఆర్ఎస్ పార్టీకి అప్పగించారని పిటిషన్ లో పేర్కొన్నారు. ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కూడా హైకోర్ట్ లో ఇదే రకమైన పిటిషన్ ను దాఖలు చేసింది. ప్రస్తుతం ఈ కేసుపై తీర్పు పెండింగ్ లో ఉంది. ఎన్జీవో దాఖలు చేసిన పిల్ పై స్పందిస్తూ.. కోర్ట్ పార్టీకి నోటీసులు జారీ చేసింది.




Updated : 14 Jan 2024 3:42 PM IST
Tags:    
Next Story
Share it
Top