Home > తెలంగాణ > Cm Revath Reddy : ఫార్మా రంగానికి బాసటగా నిలుస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్

Cm Revath Reddy : ఫార్మా రంగానికి బాసటగా నిలుస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్

Cm Revath Reddy  : ఫార్మా రంగానికి బాసటగా నిలుస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్
X

ఎన్నో పరిశోధనలకు హైదరాబాద్ నిలయంగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో బయో ఏషియా-2024 సదస్సును ప్రారంభించారు.హైదరాబాద్ లైఫ్ సైన్స్‌స్ రాజధాని అనడంలో సందేహం లేదని సీఎ వెల్లడించారు. ఫార్మా రంగంలోని సవాళ్లను తాను అర్థం చేసుకోగలనని, ఆ రంగానికి బాసటగా నిలుస్తామని స్పష్టం చేశారు. జీవవైవిధ్య, సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులపై ఇందులో చర్చించనున్నారు. పరిశోధనలు చేస్తున్న అంకుర సంస్థలకు ప్రోత్సాహకాలు, చేయూతపై నిర్ణయాలు తీసుకోనున్నామని సీఎం అన్నారు.





హైదరాబాద్‌ ఐటీ, సాఫ్ట్‌వేర్‌ రంగాల్లో అగ్రగామిగా ఉంది. కరోనా అనంతరం ప్రజలు ఆరోగ్యంపై దృష్టి సారించారు. లైఫ్‌సైన్సెస్‌ రాజధాని హైదరాబాద్‌ అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచంలో మూడు కొవిడ్‌ వ్యాక్సిన్‌లు వచ్చాయి. వాటిలో ఒక వ్యాక్సిన్‌ను అందించిన ఘనత హైదరాబాద్‌కు దక్కింది. ఎన్నో పరిశోధనలకు నిలయంగా ఉంది మన భాగ్యనగరం. జాతీయ, అంతర్జాతీయ, స్టార్టప్‌ కంపెనీలకు ప్రోత్సాహం అందించడంతో పాటు ఎంఎస్‌ఎంఈలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఫార్మా రంగంలో సవాళ్లను నేను అర్థం చేసుకోగలను. ఇటీవల కొంత మంది ఫార్మా రంగ ప్రతినిధులతో సమావేశమయ్యా. ఈ రంగానికి ప్రోత్సాహం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, పలు కంపెనీల ప్రతినిధులు పాల్గోన్నారు




Updated : 27 Feb 2024 7:09 AM GMT
Tags:    
Next Story
Share it
Top