Home > తెలంగాణ > MODI : కుటుంబ పార్టీలంటే దోచుకోవడం, దాచుకోవడమే..

MODI : కుటుంబ పార్టీలంటే దోచుకోవడం, దాచుకోవడమే..

MODI  : కుటుంబ పార్టీలంటే దోచుకోవడం, దాచుకోవడమే..
X

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. తెలుగులో ఆయన ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు అంటూ స్పీచ్ నుు మొదలు పెట్టారు. ఈ మేరకు ఆదిలాబాద్ లో ఏర్పాటు చేసిన బీజేపీ విజయసంకల్ప సభలో ఆయన పాల్గొన్నారు.

వికసిత్ భారత్ లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. దేశ అభివృద్ధి కోసం వేల కోట్ల పనులు చేపట్టామని చెప్పారు. ఇది ఎన్నికల సభ కాదనీ..ఎన్నికల తేదీ ఇంకా ప్రకటించనే లేదన్నారు. దేశవ్యాప్తంగా వికాస ఉత్సవం జరుగుతోందని అన్నారు. వికాస ఉత్సవం కోసం ఇవాళ తెలంగాణకు వచ్చానని చెప్పుకొచ్చారు. 15 రోజుల్లో దేశవ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి పనులను ప్రారంభించామన్నారు. 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం ఎన్టీపీసీ రెండో యూనిట్ ప్రారంభించామని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాభివృద్ధి కోసం కృషి చేస్తుందని అన్నారు. ఆదివాసీల గౌరవాన్ని పెంచేందుకు బీజేపీ కృషి చేస్తోందని అన్నారు. దేశవ్యాప్తంగా 7 టెక్స్ టెల్స్ పార్కుల్లో ఒకటి తెలంగాణకు కేటాయించామని అన్నారు. తెలంగాణలో సమ్మక్క, సారక్క యూనివర్సిటీని ప్రారంభిస్తున్నామని చెప్పారు.

దేశాభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని..కుటుంబ పార్టీలను నమ్ముకొవద్దని సూచించారు. తెలంగాణ రైతుల పసుపు బోర్డులను కలను సాకారం చేస్తున్నామన్నారు. మోదీ గ్యారెంటీపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోందని చెప్పారు. మోదీ గ్యారెంటీ ఇచ్చారంటే అది ఖచ్చితంగా జరిగే గ్యారెంటీ అని అందరూ అనుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని ఆరోపించారు. బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలకు జరిగేందేమి లేదన్నారు. అంతేగాక కాంగ్రెస్ పాలనలో కూడా ప్రజలు ఏమి జరగదని చెప్పారు. కాళేశ్వరంలో అవినితీ జరిగిందన్న కాంగ్రెస్ ఇప్పుడు ఏం చేస్తుందని ప్రశ్నించారు. కుటుంబ పార్టీలో రెండే అంశాలు ఉంటాయని ఒకటి దోచుకోవడం, రెండు దాచుకోవడం అని ఎద్దేవా చేశారు. తన జీవితం దేశానికి అంకితమని చెప్పారు. తెలంగాణ ప్రజల కలలను నేరవేర్చడమే తన లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.




Updated : 4 March 2024 8:10 AM GMT
Tags:    
Next Story
Share it
Top