Home > తెలంగాణ > కవిత అరెస్ట్‌పై తొలిసారి స్పందించిన ప్రధాని.. జగిత్యాల సభలో వార్నింగ్

కవిత అరెస్ట్‌పై తొలిసారి స్పందించిన ప్రధాని.. జగిత్యాల సభలో వార్నింగ్

కవిత అరెస్ట్‌పై తొలిసారి స్పందించిన ప్రధాని.. జగిత్యాల సభలో వార్నింగ్
X

తెలంగాణలో బీజేపీ ప్రభంజనంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీ కొట్టుకుపోతాయని ప్రధాని మోదీ అన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని జగిత్యాలలో జరిగిన విజయసంకల్ప సభలో మోదీ మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీకి ప్రజల మద్దతు రోజురోజుకూ పెరుగుతోంది. భారత్ అభివృద్ధి చెందితే తెలంగాణ కూడా డెవలప్మెంట్ జరుగుతుందని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ఏటీఎంలా వాడుకుందని ప్రధాని మోదీ విమర్శించారు.

ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే పని చేస్తోందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతి ప్రభుత్వాలేనని ఆరొపించారు. బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ విచారణ చేయించడం లేదన్నారు. బీఆర్ఎస్‌ను కాంగ్రెస్ కవర్ చేయాలని చూస్తోందని, తాము మాత్రం అవినీతి పరులను వదిలిపెట్టేది లేదని మోదీ వార్నింగ్ ఇచ్చారు. ప్రధాని మోదీ మహిళలపై ప్రసంశలు కురిపించారు. మహిళ పవర్ చాలా శక్తివంతమైనదన్నారు. ఉమెన్స్‌ను కాంగ్రెస్ సర్కార్ హేళన చేస్తోందని. మహిళలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి గౌరవం లేదని విమర్శించారు. మే13న తెలంగాణ ప్రజలు చరిత్ర సృష్టిస్తారని.. వికాసం కోసం బీజేపీకి ఓటు వేయాలన్నారు. జూన్4న వచ్చే ఫలితాల్లో ఎన్డీయే 400 సీట్లు గెలవాలని ఆకాంక్షించారు. విపక్షాల ఇండియా కూటమిలో ఐక్యత లేదన్నారు. రాహుల్ గాంధీ జోడో న్యాయ యాత్రతో ఒరిగింది ఏమీ లేదని విపక్షాల కూటమిలో ఐక్యత లోపించడం మోదీ అన్నారు.

Updated : 18 March 2024 7:22 AM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top