Home > తెలంగాణ > ఎస్సీ వర్గీకరణపై మోదీ కీలక నిర్ణయం.. కమిటీ ఏర్పాటుకు..

ఎస్సీ వర్గీకరణపై మోదీ కీలక నిర్ణయం.. కమిటీ ఏర్పాటుకు..

ఎస్సీ వర్గీకరణపై మోదీ కీలక నిర్ణయం.. కమిటీ ఏర్పాటుకు..
X

ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇవాళ కేబినెట్ సెక్రటరీతో పాటు సంబంధిత అధికారులకు ప్రధాని ఆదేశాలు జారీ చేశారు. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని ఈ సందర్భంగా అధికారుకులకు మోదీ సూచించారు. దీనిపై ఎమ్మార్పీఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

కాగా.. ఈ నెల 11న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన మాదిగ విశ్వరూప సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే ఎస్సీ వర్గీకరణపై ఒక కమిటీ వేస్తామని హామీ ఇచ్చారు. . ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి వున్నామని .. మాదిగలకు న్యాయం చేస్తామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ కోసం చేస్తున్న పోరాటానికి తాము మద్ధతుగా ఉంటామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే కమిటీ ఏర్పాటులో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు.

Updated : 24 Nov 2023 10:07 PM IST
Tags:    
Next Story
Share it
Top