కేసీఆర్కు గాయం.. ప్రధాని మోడీ ట్వీట్
X
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గాయం కారణంగా హాస్పిటల్లో చేరడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని మోడీ ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. ఆయన త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యవంతుడు కావాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ మేరకు ప్రధాని మోడీ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.
‘తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్కు గాయమైందని తెలిసి చాలా బాధపడ్డాను. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను’ అని మోడీ ట్వీట్లో రాశారు.
మాజీ సీఎం కేసీఆర్ గురువారం అర్ధరాత్రి ఫామ్‌హౌస్‌లోని బాత్‌రూంలో కాలు జారి పడిపోయారు. దీంతో ఆయనను వెంటనే సోమాజిగూడలోని యశోదకు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు డాక్టర్లు చెప్పారు. కాలు జారి పడిపోవడంతో కేసీఆర్ ఎడమ కాలి తుంటికి గాయమైనట్టు డాక్టర్లు గుర్తించారు. మధ్యాహ్నం సర్జరీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కేటీఆర్, హరీశ్ రావు, కవిత యశోద ఆసుపత్రిలోనే ఉన్నారు.
Distressed to know that former Telangana CM Shri KCR Garu has suffered an injury. I pray for his speedy recovery and good health.
— Narendra Modi (@narendramodi) December 8, 2023