వరంగల్ చేరుకున్న ప్రధాని మోదీ.. పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే
X
వరంగల్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ.. హకీంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలిక్యాప్టర్ లో మామునూరు మినీ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి, వరంగల్ జిల్లా నాయకులు ప్రధానికి ఘన స్వాగత పలికారు. మామునూరు నుంచి బయలు దేరిన మోదీ కాసేపట్లో వరంగల్ భద్రకాళి అమ్మవారి గుడికి చేరుకుంటారు. అక్కడ 5 నిమిషాలు ధ్యానం చేసిన తర్వాత 15 నిమిషాల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఆర్ట్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటుచేసిన బహిరంగ సభకు హాజరవుతారు.
ఉదయం 11:45 నుంచి మధ్యాహ్నం 12:20 వరకు మోదీ ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత షెడ్యూల్ లో భాగంగా.. రూ.6,100 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. రహదారుల నుంచి రైల్వేల వరకు వివిధ రంగాల్లో పనులు ప్రారంభిస్తారు. మోదీ రాకతో వరంగల్ నగరం కాషాయ మయం అయింది. మోదీ సభకు పెద్ద ఎత్తును కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు. దీంతో భద్రతను మరింత పెంచింది పోలీస్ శాఖ. ప్రస్తుతం ఎస్పీజీ, ఎన్ఎస్జీ, వరంగల్ పోలీసులు కలిపి మొత్తం 3500 మందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేశారు.
మోదీ వరంగల్ షెడ్యూల్:
ఉదయం 11:45 నుంచి మధ్యాహ్నం 12:20 వరకు మోదీ ప్రసంగం
వర్చువల్ గా కాజీపేట్ రైల్వే వాగన్ శంకుస్థాపన
రూ.6,100 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మధ్యాహ్నం 1:40కి హకీంపేట్ నుంచి రాజస్థాన్ కు పయనం