Home > తెలంగాణ > కేసీఆర్ అసమర్థ పాలనతో ప్రజలు విసిగిపోయారు : మోదీ

కేసీఆర్ అసమర్థ పాలనతో ప్రజలు విసిగిపోయారు : మోదీ

కేసీఆర్ అసమర్థ పాలనతో ప్రజలు విసిగిపోయారు : మోదీ
X

ప్రధాని మోదీ ఆదివారం మహబూబ్ నగర్లో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుడతారు. సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఈ క్రమంలో తెలంగాణ పర్యటనపై మోదీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లో బీఆర్ఎస్, కాంగ్రెస్లపై విమర్శలు గుప్పించడంతోపాటు అభివృద్ధి పనుల గురించి వివరించారు.

‘‘మహబూబ్‌నగర్‌లో ఆదివారం 13,500 కోట్లకు పైగా నిధులతో చేపడుతున్న రహదారులు, కనెక్టివిటీ, ఎనర్జీ , రైల్వేలతో సహా విభిన్న రంగాలకు చెందిన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేందుకు ఎదురుచూస్తున్నా. ఈ ప్రాజెక్టులతో తెలంగాణ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది’’ అని మోదీ ట్వీట్ చేశారు. అదేవిధంగా ‘‘అసమర్థ బీఆర్‌ఎస్‌ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారు. ప్రజలు కాంగ్రెస్‌పై కూడా అంతే అవిశ్వాసంతో ఉన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం లేని కుటుంబపార్టీలు’’ అని మరో ట్వీట్ చేశారు.




Updated : 30 Sept 2023 10:48 PM IST
Tags:    
Next Story
Share it
Top