PM MODI Telangana Tour : తెలంగాణకు మోదీ.. షెడ్యూల్ ఖరార్..
X
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. (PM MODI Telangana Tour ) అక్టోబర్ 1న ఆదివారం ఆయన నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు బీజేపీ బహిరంగ సభకు హాజరవుతారు. బేగంగపేట విమానాశ్రయం చేరుకున్న తర్వాత 1.45 నుంచి 2.15 మధ్య పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ ప్రారంభిస్తారు. తర్వాత జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. మహబూబ్ నగర్‌లో మధ్యాహ్నం 3.15 నుంచి 4.15 వరకు జరిగే బీజేపీ సభలో ప్రసంగిస్తారు. యథావిధిగా బీఆర్ఎస్‌పై విమర్శలు సంధించే అవకాశం ఉంది. కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని ఆ రోజు తిరిగి ఢిల్లీ బయల్దేరతారు. పాలమూరు సభకు లక్ష మందిని తరలించాలని బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నగారా త్వరలో మోగనున్న నేపథ్యంలో మోదీ రాష్ట్రానికి వస్తున్నారు.