Home > తెలంగాణ > రేపు తెలంగాణకు ప్రధాని మోడీ.. షెడ్యూల్ ఇదే

రేపు తెలంగాణకు ప్రధాని మోడీ.. షెడ్యూల్ ఇదే

రేపు తెలంగాణకు ప్రధాని మోడీ.. షెడ్యూల్ ఇదే
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు మరో మూడు వారాల సమయం మాత్రమే ఉండటంతో బీజేపీ జోరు పెంచింది. ప్రచారం ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ మరోసారి తెలంగాణకు రానున్నారు. మంగళవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న బీసీ గర్జన సభలో పాల్గొంటారు. ఈ సభకు తెలంగాణతో పాటు ఏపీకి చెందిన పలువురు బీసీ నేతలు హాజరుకానున్నట్లు సమాచారం. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం సభలో పాల్గొంటారు.

ప్రధాని షెడ్యూల్

ప్రధాని మోడీ నవంబర్ 7 సాయంత్రం 5.05 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఎల్బీ స్టేడియానికి వెళ్తారు. సాయంత్రం 5.30 నుంచి 6.10 గంటల వరకు బీసీ బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు. సాయంత్రం 6.35కి బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్తారు.

బీసీ గర్జన సభలో బీజేపీ సీఎం అభ్యర్థి పేరును ప్రకటిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో ఎల్బీ స్టేడియం వేదికగా ప్రకటన ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే పార్టీకి అనుకూలంగా బీసీల మద్దతు కూడగట్టవచ్చని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ నెల 11న సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ లో ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించే మాదిగల ఆత్మగౌరవ సభ జరగనుంది. దీనికి కూడా ప్రధాని మోడీ హాజరుకానున్నారు. ఈ సభలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై బీజేపీ వైఖరిని ప్రకటించే అవకాశముంది.



Updated : 6 Nov 2023 2:20 PM GMT
Tags:    
Next Story
Share it
Top