Home > తెలంగాణ > MODI TOUR: నేడు నిజామాబాద్‌కు ప్రధాని.. పూర్తి షెడ్యూల్ ఇదే

MODI TOUR: నేడు నిజామాబాద్‌కు ప్రధాని.. పూర్తి షెడ్యూల్ ఇదే

MODI TOUR: నేడు నిజామాబాద్‌కు ప్రధాని.. పూర్తి షెడ్యూల్ ఇదే
X

ప్రధాని నరేంద్ర మోదీ నేడు రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. మూడు రోజుల వ్యవధిలోనే తెలంగాణలో రెండోసారి పర్యటిస్తున్నారు ప్రధాని. ఈ నెల 1న మహబూబ్‌నగర్‌లో రూ.13,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపారు. ఇక ఈ రోజు నిజామాబాద్‌ పర్యటనలో దాదాపు రూ. 8 వేల కోట్ల అభివృద్ధి పనులను, శంకుస్థాపనలను చేయనున్నారు. విద్యుత్, రైల్వే, ప్రజారోగ్యానికి సంబంధించి రూ.8,021 కోట్ల విలువైన ప్రాజెక్టులకు వర్చువల్‌ విధానంలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. తర్వాత ఇక్కడి గిరిరాజ్‌ కాలేజీ మైదానంలో నిర్వహించే బీజేపీ బహిరంగ సభలో రాజకీయ ప్రసంగం చేయనున్నారు

ఈ సభకు భారీ ఎత్తున రైతులను, మహిళలను రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది కమల దళం. దశాబ్దాల కల(పసుపు బోర్డు) నెరవేరడంతో రైతులు కూడా భారీ ఎత్తున సభకు తరలి వస్తారని బీజేపీ నాయకులు యోచిస్తున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు.. ఇటీవల మహిళా బిల్లుకు ఆమోదం లభించడంతో మహిళలతో పెద్ద ఎత్తున ప్రధానికి స్వాగతం పలికేందుకు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.

అభివృద్ధి కార్యక్రమాల వివరాలు:

నిజామాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ తొలుత రామగుండంలో నిర్మించిన 8 వందల మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్‌ను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు.

‘ప్రధానమంత్రి ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మిషన్‌’ కింద రూ.516.5 కోట్లతో తెలంగాణలోని 20 జిల్లా కేంద్ర ఆస్పత్రుల్లో నిర్మించనున్న 50 పడకల క్రిటికల్‌ కేర్‌ విభాగాలకు శంకుస్థాపన చేస్తారు.

రూ. 1200 కోట్ల వ్యయంతో మనోహరాబాద్ - సిద్దిపేట మధ్య నిర్మించి రైలు మార్గాన్ని ప్రధాని వర్చువల్‌గా ప్రారంభిస్తారు.

రూ.305 కోట్లతో నిర్మితమైన రైల్వే విద్యుత్ లైన్‌ను ప్రజలకు అంకితం చేస్తారు.

సిద్దిపేట- సికింద్రాబాద్ మార్గంలో తొలి రైలు సర్వీసును ప్రధాని వర్చువల్‌గా ప్రారంభిస్తారని రైల్వే అధికారులు వెల్లడించారు.

ప్రధాని షెడ్యూల్‌ ఇదీ:

ప్రధాని మోడీ మధ్యాహ్నాం 2:10 గంటలకు బీదర్ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నాం 2:55 గంటల ప్రాంతంలో నిజామబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి సభ స్థలికి చేరుకుంటారు.

3:00 నుంచి 3:35 గంటల వరకు వర్చువల్ విధానంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు.

3:45 నుంచి 4:45 గంటల వరకు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

సాయంత్రం 5 గంటల ప్రాంతంలో నిజామాబాద్ నుంచి బయలుదేరి 5:45 గంటలకు బీదర్ కు తిరుగు ప్రయాణమవుతారు. అనంతరం అక్కడి నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.

Updated : 3 Oct 2023 2:33 AM GMT
Tags:    
Next Story
Share it
Top