హైదరాబాద్లో మోదీ పర్యటన..నగరంలో హై అలర్ట్
X
హైదరాబాద్ లో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ప్రధాని ఉన్న రాజ్‌భవన్ చుట్టూ పక్కన ప్రాంతాలు, బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి రాజ్‌భవన్‌కు వచ్చిపోయే మార్గాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అనంతరం ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ఆలయానికి ప్రధాని వెళ్లనున్నారు. అమ్మవారిని దర్శించుకోని మొక్కులు చెల్లించుకొనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రధాని మోదీకి అర్చకులు, వేదపండితులు ఘన స్వాగతం పలకనున్నారు.
అంతేగాక పటాన్‌చెరుకు ప్రధాని మోదీ రానున్న సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు ముత్తంగి అవుటర్ ఎక్కి మరోవైపు నుంచి దిగి సర్వీస్‌రోడ్డు ద్వారా ఎల్లంకి కాలేజ్ కి చేరుకోవచ్చని చెప్పారు. కొల్లూరు అవుటర్ జంక్షన్ వద్ద దిగడానికి అనుమతిస్తున్నామని పోలీసులు అన్నారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.