Home > తెలంగాణ > నేడు తెలంగాణకు ప్రధాని మోడీ.. రెండు రోజుల టూర్!

నేడు తెలంగాణకు ప్రధాని మోడీ.. రెండు రోజుల టూర్!

నేడు తెలంగాణకు ప్రధాని మోడీ.. రెండు రోజుల టూర్!
X

నేడు ప్రధాని మోడీ తెలంగాణకు రానున్నారు. రెండు రోజుల పాటు రాష్ట్రంలో ఆయన పర్యటన సాగనుంది. ప్రధాని పర్యటనకు సంబంధించి బీజేపీ షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. సోమవారం ఉదయం తెలంగాణలో అడుగుపెట్టనున్న మోడీ ఉదయం 10.30 గంటల నుంచి 11 గంటల వరకూ ఆదిలాబాద్‌లోని పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆ తర్వాత 12 గంటల వరకూ బహిరంగ సభలో మోడీ ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం తమిళనాడుకు వెళ్లి తిరిగి రాత్రికి హైదరాబాద్‌కు చేరుకుంటారు.

రాత్రికి రాజ్‌భవన్‌లో ప్రధాని మోడీ బస చేయనున్నారు. మార్చి 5వ తేదిన సంగారెడ్డిలో ప్రధాని మోడీ పర్యటించి పలు అభివృ‌ద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టనున్నారు. మంగళవారం మధ్యాహ్నం బీజేపీ బహిరంగ సభలో మోడీ ప్రసంగించనున్నారు. తెలంగాణ పర్యటన తర్వాత మోడీ ఒడిశాకు బయల్దేరి వెళ్లనున్నారు. ఇకపోతే రాష్ట్రంలో మొత్తం రూ.15,718 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.

ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. హైదరాబాద్ నగరానికి భారీ ఎత్తున పోలీసు బలగాలు చేరుకున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ప్రధాని మోడీ వస్తుండటంతో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సిద్దమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రానికి తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని మంత్రి సీతక్క అన్నారు.




Updated : 4 March 2024 2:22 AM GMT
Tags:    
Next Story
Share it
Top