Home > తెలంగాణ > ములుగు సెంటర్లో చర్చకు సిద్ధమా?.. సీతక్క vs పోచంపల్లి

ములుగు సెంటర్లో చర్చకు సిద్ధమా?.. సీతక్క vs పోచంపల్లి

ములుగు సెంటర్లో చర్చకు సిద్ధమా?.. సీతక్క vs పోచంపల్లి
X

ములుగు నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం రోజురోజుకు వేడెక్కుతుంది. సీతక్క వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఇటీవల ములుగు నియోజకవర్గంలోని ఓటర్లకు కల్తీ సారా, దొంగనోట్లు పంచుతున్నారని సీతక్క చేసిన ఆరోపణలకు బీఆర్ఎస్ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు. సీతక్క చేసిన ఆరోపణలను రుజువు చేయాలని, దొంగనోట్లు ఎక్కడ పంచుతున్నామో చూపాలన్నారు. ఎన్నికల కమిషన్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తక్షణ సుమోటోగా కేసును నమోదు చేసి సీతక్కపై కేసు నమోదుచేయాలని కోరారు. సీతక్క చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నియామావళిని అనుమానించేలా ఉన్నాయని, ఓటమి భయం పట్టుకుని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందని పోచంపల్లి ఆరోపించారు.

బీఆర్ఎస్ పార్టీ కర్నాటక, ఛత్తీస్ గడ్ నుంచి వందలకోట్ల చందాలు తెచ్చుకుని ప్రజలకు పంచుతుందని తీవ్ర విమర్శలుచేశారు. కరోనా కష్టాన్ని కరెన్సీ చేసుకున్న చరిత్ర సీతక్కదని ఆరోపించారు. తనను కేసీఆర్, కేసీఆర్ లకు బీనామీగా చెప్తున్న సీతక్క.. ఈ విషయంలో ములుగు సెంటర్లో తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో సీతక్క చౌకబారు రాజకీయాలు చేస్తుందని విమర్శించారు.

Updated : 14 Nov 2023 11:15 AM IST
Tags:    
Next Story
Share it
Top