TS Election : పోలీసుల తనిఖీలు.. భారీగా పట్టుబడ్డ నగదు, బంగారం
X
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసుల తనిఖీలు ముమ్మరం చేశారు. భారీగా నగదు మద్యం స్వాధీనం చేసుకున్నారు. 24 గంటల్లో సోదాల్లో దొరికిన వాటి మొత్తం విలువ రూ.18.01 కోట్లు ఉంటుందని అధికారులు చెప్పారు. .అక్టోబర్ 9 నుంచి ఇప్పటి వరకు జప్తు చేసిన వాటి విలువ దాదాపు రూ.300కోట్లు దాటిందని ప్రకటించారు.
ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకు పట్టుకున్న నగదు, మద్యం, బంగారం, ఇతర వస్తువుల విలువ 307.2 కోట్లకుపైగా ఉంటుందని అధికారులు చెప్పారు. గత 24గంటల్లో రూ. 9.69 కోట్ల నగదు పట్టుబడగా, ఈ రోజు వరకు స్వాధీనం చేసుకున్న నగదు విలువ రూ.105.58 కోట్లు. గడిచిన 24 గంటల్లో 1.35 లక్షల విలువైన మద్యాన్ని పట్టుకోగా.. అక్టోబర్ 9 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 13.58కోట్ల విలువైన లిక్కర్ స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం నుంచి ఇప్పటి వరకు రూ.72లక్షల విలువైన గంజాయి పట్టుబడింది.
ఇక గడిచిన 24 గంటల్లో పోలీసుల తనిఖీల్లో రూ.3.81 కోట్ల విలువైన బంగారం, 894 కిలోల వెండి, 190 క్యారెట్ల వజ్రాలు, 5 గ్రాముల ప్లాటినం స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రూ.26.93 కోట్ల విలువైన ఇతర వస్తువులు పట్టుబడ్డాయి.