కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై కేసు నమోదు
X
Thumb : బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు
కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై పోలీసు కేసు నమోదైంది. ఓ భూ వ్యవహారానికి సంబంధించి కోర్టు ఆదేశాలతో ఎమ్మెల్యే సహా మరో ఇద్దరిపై కేసు నమోదైంది. నరేందర్ రెడ్డి.. మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఉప్పరపల్లిలోని ఓ స్థలాన్ని సామా ఇంద్రపాల్ రెడ్డి అనే వ్యక్తికి అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. 3.65 కోట్లకు ఈ డీల్ కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది.
ఈ క్రమంలో ఇంద్రపాల్ 3.05కోట్లు చెల్లించాడు. మిగితా 60లక్షలు ఆలస్యమవుతుందని.. తర్వాత చెల్లిస్తానని చెప్పాడు.
కానీ మిగితా డబ్బు కూడా వెంటనే చెల్లించాలని ఎమ్మెల్యే సహా ఆయన అనుచరులు బెదిరింపులకు పాల్పడ్డారని ఇంద్రపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో హైదరాబాద్ కమిషనర్ను ఆశ్రయించారు. దీంతో కమిషనర్ వెస్ట్ జోన్ డీసీపీకి కేసును రిఫర్ చేశారు. అయితే అక్కడ కూడా తనకు న్యాయం జరగకపోవడంతో ఇంద్రపాల్ కోర్టును ఆశ్రయించాడు.
ఇంద్రపాల్ ఫిర్యాదుతో బాధ్యులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బంజారాహిల్స్ పోలీసులను కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో బంజారాహిల్స్ పోలీసులు ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, రాకేశ్ రెడ్డిపై పలు సెక్షన్లపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఫిల్మ్‌నగర్ పరిధిలో జరిగిన దృష్ట్యా అనంతరం కేసును ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.