Home > తెలంగాణ > పర్మిషన్ లేకుండా పటాకులు కాలిస్తే కేసు.. డీజేలు, డ్రోన్లు సీజ్

పర్మిషన్ లేకుండా పటాకులు కాలిస్తే కేసు.. డీజేలు, డ్రోన్లు సీజ్

పర్మిషన్ లేకుండా పటాకులు కాలిస్తే కేసు.. డీజేలు, డ్రోన్లు సీజ్
X

తెలంగాణ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇతర పార్టీలతో పోటీలు పడుతూ.. వారిని మించి ప్రచారం చేస్తున్నారు. హడావిడి చేస్తూ ఫోకస్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎలక్షన్ కోడ్ పై అవగాహన లేని పార్టీ కార్యకర్తలు చేస్తున్న పనులు నాయకులకు తలనొప్పిగా మారాయి. ప్రచారంలో హడావిడి చేసేందుకు పటాకులు కాల్చినా పోలీసులు కేసు పెడుతున్నారు. అనుమతి లేకుండా డీజేలు, డ్రోన్లు ఎగరేసినా వాటిని సీజ్ చేస్తున్నారు. ముందస్తు పర్మిషన్ ఉండి.. ప్రచారంలో కాస్త లేట్ అయినా.. కేసులు నమోదు చేస్తున్నారు. ఎన్నికల నియమావలి ఉల్లంఘించిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ వారం రోజుల నుంచి కేసులు 15 శాతం ఎక్కువయ్యాయి. రాజకీయ పార్టీలు, వ్యక్తులకు అతీతంగా కేసులు నమోదు చేస్తుండటంతో.. అభ్యర్థులు బెంబేలెత్తిపోతున్నారు.

ఈ క్రమంలో ఎలక్షన్ కమిషన్ రాజకీయ పార్టీలకు షాక్ తగిలింది. రాజకీయ ప్రకటనలను రద్దు చేస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. ఇప్పటివరకు ఇచ్చిన అనుమతులను కూడా రద్దు చేసింది. మీడియాలోనూ యాడ్స్ వేయవద్దని ఆయా సంస్థలను ఈసీ సూచించింది. ఎంఎస్ఎంసీ (మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ) నిబంధనలను ఉల్లంఘించి, యాడ్స్ ను ప్రసారం చేస్తున్న కారణంగానే రాజకీయ ప్రకటనలకు ఆమోదం రద్దు చేస్తున్నట్లు ప్రకటనలో వెల్లడించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అన్ని న్యూస్ ఛానెల్స్, సోషల్ మీడియా సైట్స్ కు లేఖలు రాశారు.




Updated : 12 Nov 2023 8:45 AM IST
Tags:    
Next Story
Share it
Top