Home > తెలంగాణ > Telangana Assembly Election 2023: మంత్రి గంగుల కమలాకర్ వాహనంలో పోలీసుల తనిఖీలు

Telangana Assembly Election 2023: మంత్రి గంగుల కమలాకర్ వాహనంలో పోలీసుల తనిఖీలు

Telangana Assembly Election 2023: మంత్రి గంగుల కమలాకర్ వాహనంలో పోలీసుల తనిఖీలు
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడ్డ క్రమంలో.. ఎన్నికల్లో ధనం, మద్యం ప్రవాహాన్ని అరికట్టేందుకు ఎన్నికల సంఘం పోలీసులను రంగంలోకి దింపింది. రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా.. రాష్ట్ర సరిహద్దుల్లోనూ తనిఖీలు చేపడుతోంది. పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న వాహానాల్లో ముమ్ముర తనిఖీలు చేపడుతోంది. సామాన్య ప్రజలనే కాదు రాజకీయ ప్రముఖుల వాహనాలను సైతం ఆపి పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు పోలీసు అధికారులు. చివరకు మంత్రులు, ఎమ్మెల్యేల వాహనాలను సైతం పోలీసులు వదిలిపెట్టడం లేదు. తాజా రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వాహనాన్ని తనిఖీ చేసారు.

కరీంనగర్ నుండి సిరిసిల్లకు మంత్రి గంగులతో పాటు బీఆర్ఎస్ ఎంపీ కేశవరావు, మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ వెళుతుండగా మార్గమధ్యలో పోలీసులు ఆపారు. కొదురుపాక వద్ద వీరు వెళుతున్న కారును అడ్డుకుని తనిఖీలు చేపట్టారు. ఇందుకు బిఆర్ఎస్ నాయకులు సైతం సహకరించారు.కారులోని బ్యాగులతో పాటు ఇతర వస్తువులను పోలీసులు తనిఖీ చేసారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు గానీ, నగదు గానీ గంగుల కారులో లభించలేదు. దీంతో తనిఖీలు ముగిసిన తర్వాత నాయకులు సిరిసిల్లకు పయనమయ్యారు.



Updated : 16 Oct 2023 1:32 PM IST
Tags:    
Next Story
Share it
Top