Home > తెలంగాణ > ప్రీతి హత్య కేసు.. పోలీసుల చార్జ్షీట్లో కీలక విషయాలు

ప్రీతి హత్య కేసు.. పోలీసుల చార్జ్షీట్లో కీలక విషయాలు

ప్రీతి హత్య కేసు.. పోలీసుల చార్జ్షీట్లో కీలక విషయాలు
X

మెడికో ప్రీతి ఆత్మహత్య కేసులో ఎట్టకేలకు పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేశారు. మొత్తం 970 పేజీలతో కూడిన చార్జ్షీట్ను కోర్టుకు సమర్పించిన పోలీసులు.. ప్రీతి మృతికి సైఫ్ వేధింపులే ప్రధాన కారణమని స్పష్టం చేశారు. సైఫ్ కులం పేరుతో దూషించడంతోపాటు ర్యాగింగ్ చేయడంతో ప్రీతి డిప్రెషన్‌కు లోనై, ఆత్మహత్య చేసుకుందని చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. ప్రీతి కాలేజీలో చేరినప్పటి నుంచి.. సైఫ్ ఆమెను పలు రకాలుగా హేళన చేస్తూ మానసికంగా ఇబ్బందులకు గురిచేశాడని పోలీసులు తెలిపారు.

ఆ వేధింపులు భరించలేక.. ప్రీతి ఫిబ్రవరి 22వ తేదీన ఉదయం 08.10 గంటలకు ఆత్మహత్యాయత్నం చేసిందని పోలీసులు చార్జ్షీట్లో వివరించారు. ఈ కేసులో మొత్తం 70 మంది సాక్షులను విచారించినట్లు చెప్పారు. ‘‘సైంటిఫిక్ , టెక్నికల్, మెడికల్ , ఫోరెన్సిక్ నిపుణల సహకారంతో మృతురాలు.. నిందితుడు, వాళ్ల ఫ్రెండ్స్ సెల్ ఫోన్ డాటా వెలికి తీసి సాక్ష్యాధారాలు సేకరించాం. ప్రీతీని పలు రకాలుగా వేధించి.. ఆత్మహత్య చేసుకునేలా సైఫ్ ప్రేరేపించారని ఆధారాలతో సహా చార్జిషీట్ దాఖలు చేశాం’’ అని సీపీ రంగనాథ్ ప్రకటించారు.

కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ చదువుతున్న ప్రీతి నాయక్ ఫిబ్రవరి 22న పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. తొలుత ఆమెది హత్యగా అనుమానించినప్పటికీ.. పోస్ట్ మార్టం రిపోర్ట్, పలు సాక్ష్యాలతో ఆత్మహత్యేనని పోలీసులు తేల్చారు. ఆమె సీనియర్ సైఫ్ వేధింపుల వల్లే ఆమె మరణించిందనే ఆరోపణలు ఉండగా.. పోలీసులు కూడా అదే నిజమని నిర్ధారించారు. కాగా ప్రస్తుతం సైఫ్ బెయిల్పై బయట ఉండడం గమనార్హం.


Updated : 7 Jun 2023 4:01 PM GMT
Tags:    
Next Story
Share it
Top