Home > తెలంగాణ > ఎమ్మెల్యే - సర్పంచ్ ఎపిసోడ్లో ట్విస్ట్.. పోలీసుల నోటీసులు

ఎమ్మెల్యే - సర్పంచ్ ఎపిసోడ్లో ట్విస్ట్.. పోలీసుల నోటీసులు

ఎమ్మెల్యే - సర్పంచ్ ఎపిసోడ్లో ట్విస్ట్.. పోలీసుల నోటీసులు
X

బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య వర్సెస్ జానకీపురం సర్పంచ్ నవ్య ఎపిసోడ్ కొత్త మలుపు తిరిగింది. తాజాగా సర్పంచ్ నవ్యకు పోలీసులకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 21 పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించిన సాక్ష్యాధారాలను రెండు రోజుల్లో అందజేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అదేవిధంగా కాజీపేట ఏసీపీ ఆఫీస్ కూడా నవ్యకు నోటీసులు జారీ చేసింది. సాక్ష్యాధారాలతో మూడు రోజుల్లో తమను సంప్రదించాలని నోటీసుల్లో కోరింది.

ఈ నెల 21న నవ్య.. ఆమె భర్తతో పాటు ఎమ్మెల్యే రాజయ్య సహా ముగ్గురిపై ధర్మసాగర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఒప్పంద పత్రంపై సంతకం చేయాలని ఒత్తిడి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యే వేధింపులకు సంబంధించి తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని నవ్య ఫిర్యాదు టైంలోనే స్పష్టం చేశారు. ఆ తర్వాత ఫిర్యాదుపై ఫోన్ లిఫ్ట్ చేయకుండా సైలెంట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యే తనను లైంగికంగా వేధించారని గతంలో నవ్య ఆరోపించారు. అయితే రాజయ్య సారి చెప్పడంతో పాటు గ్రామాభివృద్ధికి 25లక్షలు ఇస్తానని అప్పట్లో హామీ ఇచ్చారు. అందులో నయాపైసా ఇవ్వకపోగా.. ఇచ్చినట్లుగా బాండ్ పేపర్పై సైన్ చేయమంటున్నారని నవ్య ఇటీవల ఆరోపించింది. తన భర్తను ట్రాప్ చేసి.. సంతకం కోసం ఒత్తిడి చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు.

Updated : 24 Jun 2023 2:07 PM IST
Tags:    
Next Story
Share it
Top