సీపీఆర్ చేసి మహిళ ప్రాణాలు కాపాడిన పోలీస్
X
విధి నిర్వహణలో లా అండ్ అర్డర్ ను కాపాడడమే కాకుండా..ఎందరో నిండు ప్రాణాలను కాపాడుతూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు పోలీసులు. తాజాగా అలాంటి ఘటనే భువనగిరిలో జరిగింది. కార్డిక్ అరెస్ట్ తో రోడ్డు పై స్పృహ తప్పి పడిపోయిన మహిళకు సీపీఆర్ చేసి మానవత్వాన్ని చాటుకున్నాడో పోలీసు. అయితే భువనగిరి మండలం మన్నెవారిపంపు గ్రామానికి చెందిన బోయిని వెంకటమ్మ బస్టాండ్ లో బస్సు కోసం ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో ఆమెకు సడెన్ గా హర్ట్ ఎటాక్ రావడంతో స్పృహ తప్పి ఉన్నచోటే కుప్పకూలిపోయింది. దీంతో ఏం చేయాలో తెలిక భర్త నర్సింహ రోడ్డుపై కాపాడండి అంటూ కేకలు పెట్టాడు. దీంటో అటుగా వెళ్తున్న వలిగొండ ఎస్సై డి. మహేందర్ లాల్ వెంటనే సీపీఆర్ చేశారు.
బాధితురాలి ఛాతిపై గట్టిగా నొక్కుతూ సీపీఆర్ అందించడంతో వెంటనే ఆమె స్పృహలోకి వచ్చింది. అనంతరం వెంటనే వెంకటమ్మను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే ఆపదలో ఉన్నవారి కాపాడేందుకు ప్రభుత్వం సీపీఆర్ శిక్షణ అందించింది. మహిళకు సీపీఆర్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మహిళ ప్రాణాలు కాపాడిన పోలీసుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మానవత్వం, చాకచాక్యంతో ఆమె ప్రాణాలు కాపాడిన పోలీస్ మహేందర్ కు మనస్ఫూర్తిగా సెల్యూట్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సీపీఆర్ చేసి మహిళ ప్రాణాలు కాపాడిన పోలీస్
— Telugu Scribe (@TeluguScribe) February 11, 2024
యాదాద్రి భువనగిరి - వలిగొండ పీఎస్ ఎస్సై మహేందర్ లాల్ విధుల్లో ఉన్న సమయంలో ఆ దారిలో ఓ మహిళకు గుండెపోటు వచ్చి సృహ కోల్పోయింది.. వెంటనే స్పందించిన ఎస్సై సీపీఆర్ చేసి ఆమెను స్పృహలోకి తీసుకొచ్చి వెంటనే ఆస్పత్రికి తరలించారు. pic.twitter.com/pbRCXDXYkI