Home > తెలంగాణ > హైదరాబాద్లో విదేశీయుల నకిలీ నోట్ల దందా

హైదరాబాద్లో విదేశీయుల నకిలీ నోట్ల దందా

హైదరాబాద్లో విదేశీయుల నకిలీ నోట్ల దందా
X

హైదరాబాద్ లో నకిలీ నోట్ల దందా కలకలం రేపింది. ఫేక్ ఇండియన్ కరెన్సీని తయారుచేస్తున్న ఇద్దరు విదేశీయులను మల్కాజిగిరి ఎస్ వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం (జనవరి 24) మీడియాతో మాట్లాడిన రాచకొండ సీపీ సుధీర్ బాబు వివరాలు తెలిపారు. దుండగులు ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి.. లక్షకు ఐదు లక్షలు ఇస్తామంటూ ఆశ చూపి మోసం చేస్తున్నారని అన్నారు. అలా ఆశతో వచ్చిన వారిపై మత్తుమందు చల్లి వాళ్ల నుంచి డబ్బులు తీసుకుని పారిపోతున్నారని ఈ సందర్భంగా చెప్పారు.

బోడుప్పల్ వాసి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.. నిందితుల వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు. కాగా ఈ ముఠాలోని ముగ్గురు పరారీలో ఉండగా.. నిందితుల్లో ఇద్దరు కామెరాన్, మాలీ దేశస్తులుగా పోలీసులు గుర్తించారు. వారి నుంచి రూ.25 లక్షల నకిలీ నోట్లతో పాటు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దీని వెనుక ఇంకా ఎంతమంది ఉన్నారో విచారణ చేస్తామని సీపీ సుధీర్ బాబు చెప్పారు.

Updated : 24 Jan 2024 4:03 PM IST
Tags:    
Next Story
Share it
Top