Jubilee Hills MLA PA: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పీఏ అరాచకం.. యువకుడిపై విచక్షణరహితంగా..
X
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పీఏ భాస్కర్ అరాచకంగా వ్యవహరించారు. ఓ యువకుడిపై విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు సుమోటోగా కేసును నమోదు చేశారు. ఎమ్మెల్యే పీఏతో పాటు మరో వ్యక్తిపై అటెంప్ట్‌డ్ మర్డర్ కేసు బుక్ చేశారు. బాధితుడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాకు చెందిన చందుగా గుర్తించారు.
కృష్ణానగర్ లో శనివారం అర్ధరాత్రి చందు అనే వ్యక్తి ఓ మహిళతో ఉన్నాడు. అయితే లలిత్ అనే వ్యక్తి వారిని ఇక్కడ ఏంచేస్తున్నావ్ అని ప్రశ్నించాడు. మాటమాట పెరగడంతో గొడవ స్టార్ట్ అయ్యింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే పీఏ భాస్కర్ కర్రతో చందును విచక్షణరహితంగా కొట్టారు. అంతా కలిసి కొట్టడంతో చందుకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకునేలోపే భాస్కర్ గ్యాంగ్ పరారైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.