Home > తెలంగాణ > సికింద్రాబాద్ స్టేషన్లో కిడ్నాపైన బాలుడి కథ సుఖాంతం..

సికింద్రాబాద్ స్టేషన్లో కిడ్నాపైన బాలుడి కథ సుఖాంతం..

సికింద్రాబాద్ స్టేషన్లో కిడ్నాపైన బాలుడి కథ సుఖాంతం..
X

సికింద్రాబాద్ రైల్వే‌స్టేషన్‌లో కిడ్నాపైన ఐదేళ్ల బాలుడి కథ సూఖాంతమైంది. ఆ బాలుడు మదాపూర్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు రక్షించారు. కిడ్నాప్ చేసిన ఇద్దరు దుండగులను అరెస్టు చేశారు. కిడ్నాపర్లు సైబర్ టవర్స్ వద్ద బాలుడిని అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అక్కడకు చేరుకున్నారు. వారిని గమనించిన కిడ్నాపర్లు అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించగా పోలీసులు పట్టుకున్నారు. బాలుడు కిడ్నాప్ అయిన కొన్ని గంటల్లోనే ఆచూకి కనుగొన్న పోలీసులు అతన్ని తండ్రికి అప్పగించారు.

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాయాలపురానికి చెందిన దుర్గేశ్, తన ఐదేళ్ల కుమారుడి శివ సాయితో కలిసి తిరుపతి వెళ్ళాడు. ఈ నెల 28న తిరిగి హైదరాబాద్ చేరుకున్నాడు. ఆ రోజు ఉదయం 5:30కు సికింద్రాబాద్ స్టేషన్‌లో దిగిన దుర్గేశ్‌ అలిసిపోయి ఉండటంతో స్టేషన్‌లోనే పడుకున్నాడు. అనంతరం సాయంత్రం 4:30 కు దుర్గేశ్ తన కుమారుడిని బ్యాగులతో 1 నెంబర్ ప్లాట్ ఫామ్ వద్ద ఉంచి వాష్‌రూంకి వెళ్లాడు. వచ్చి చూసేలోపు బాబు కనిపించకపోవడంతో రైల్వే పోలీసులను ఆశ్రయించారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు బాబును కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్నట్లు తేలింది. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసుుల బాలుడిని రక్షించారు.

Updated : 30 Sept 2023 2:51 PM IST
Tags:    
Next Story
Share it
Top