Home > తెలంగాణ > భారీ వర్షాల నేపథ్యంలో ఉద్యోగులకు పోలీసుల సూచన

భారీ వర్షాల నేపథ్యంలో ఉద్యోగులకు పోలీసుల సూచన

భారీ వర్షాల నేపథ్యంలో ఉద్యోగులకు పోలీసుల సూచన
X

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో తెలంగాణ పోలీసులు ఐటీ ఉద్యోగులకు పలు సూచనలు చేశారు. సాధ్యమైనంత వరకూ వర్క్‌ ఫ్రం హోం చేసుకోవాలని సూచించారు. అత్యవసర సేవల ఉద్యోగులు ఆఫీస్‌ నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షాలు కురవని సమయంలో.. రద్దీ తక్కువగా ఉండే సమయంలో ఆఫీసుల నుంచి బయల్దేరాలని చెప్పారు.





భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లోను ట్రాఫిక్ జామ్ కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు.. ఐటీ కంపెనీలలో పని చేసే ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ చేసుకోవాలని చెబుతున్నారు. ఇదిలా ఉండగా భారీ వర్షం కారణంగా నగరంలో పలు చోట్ల భారీగా వరద చేరి కాలనీలు మునిగిపోయాయి. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ సిబ్బంది వరద నీటిని పంపించే ప్రయత్నం చేస్తున్నారు.





సెప్టెంబర్ 3వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా వాన దంచికొడుతోంది. ఇక సెప్టెంబర్ 5వ తేదీ అయితే..ఆకాశానికి రంధ్రపడిందా అన్నట్లు కుండపోతగా వర్షం కురిసింది. హైదరాబాద్ అంతా బీభత్సమైన వాన పడింది. అన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. మియాపూర్ లో అత్యధికంగా 14.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత కూకట్‌పల్లిలో 14.3 సెంటీమీటర్లు, శేరిలింగంపల్లిలో 14 సెంటీ మీటర్ల వాన పడింది. శివరాం పల్లిలో 13 సెంటీమీటర్లు..గాజుల రామారావు లో 12.5 సెంటీమీటర్ల వర్షం దంచికొట్టింది.







Updated : 5 Sep 2023 8:05 AM GMT
Tags:    
Next Story
Share it
Top