Home > తెలంగాణ > స్టూడెంట్స్ మృతదేహాలపై కొరికిన గాయాలు.. వెలుగులోకి సంచలన విషయాలు

స్టూడెంట్స్ మృతదేహాలపై కొరికిన గాయాలు.. వెలుగులోకి సంచలన విషయాలు

స్టూడెంట్స్ మృతదేహాలపై కొరికిన గాయాలు.. వెలుగులోకి సంచలన విషయాలు
X

భువనగిరిలో ఇద్దరు స్టూడెంట్స్ ఆత్మహత్యలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎస్సీ బాలికల హాస్టల్లో భవ్య, వైష్ణవి అనే విద్యార్థినిలు శనివారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారిది ఆత్మహత్య కాదు హత్య అంటూ బాలికల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థినిల మృతదేహాలపై కొరికిన గాయాలున్నాయి. హాస్టల్ వార్డెన్ శైలజకు ఓ ఆటో డ్రైవరుతో అక్రమ సంబంధం ఉందని.. ఆ విషయం భవ్య, వైష్ణవిలకు తెలియడంతో వారిని వార్డెన్ వేధించినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలో తమ బిడ్డలని హత్య చేసి ఫేక్ సూసైడ్ లెటర్ సృష్టించారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సూసైడ్ లెటర్లో వార్డెన్ శైలజ శైలజ మంచిది.. ఆమెను ఒక్క మాట కూడా అనకండి అని ఉండడం గమనార్హం. పోలీసులు వార్డెన్ శైలజ, ఆటో డ్రైవర్ ఆంజనేయులును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ హాస్టల్ వద్ద బాలికల కుటుంబసభ్యలు ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అసలేం జరిగిందంటే..?

హైదరాబాద్‌లోని హబ్సిగూడకు చెందిన భవ్య, వైష్ణవి ఎస్సీ హాస్టల్లో ఉంటూ రెడ్డివాడ గర్ల్స్ హైస్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్నారు. శనివారం స్కూల్కు వెళ్లొచ్చిన విద్యార్థినులు సాయంత్రం ట్యూషన్కు వెళ్లలేదు. రాత్రి భోజనం చేశాక ట్యూషన్కు వస్తామంటూ టీచర్కు చెప్పారు. అయితే భోజనం చేయడానికి కూడా వారు రాకపోవడంతో వాళ్ల ఫ్రెండ్స్కు డౌట్ వచ్చింది. రూమ్కు వెళ్లి చూడగా.. రెండు ఫ్యాన్లకు ఇద్దరు ఉరి వేసుకుని కనిపించారు. టీచర్లు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు స్పష్టం చేశారు.





Updated : 5 Feb 2024 10:43 AM IST
Tags:    
Next Story
Share it
Top