అప్సర కేసు.. ఇవాళ రాత్రి సీన్ రీకన్స్ట్రక్షన్
X
సరూర్ నగర్ అప్సర హత్యకేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సాయికృష్ణను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. నిందితుడిని రెండురోజుల పాటు కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతిచ్చింది. దీంతో అతడిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. ఇవాళ రాత్రి అతడిని హత్య జరిగిన ప్రాంతానికి తీసుకెళ్లి సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయనున్నారు. అప్సర హత్యకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించనున్నారు.
శంషాబాద్ సమీపంలో అప్సరను సాయికృష్ణ దారుణంగా చంపేశాడు. ఆ తర్వాత శవాన్ని మ్యాన్ హోల్లో పడేశాడు. ఏమి తెలియనట్లుగా ఆమె తల్లితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టెక్నాలజీ సాయంతో విచారణ జరిపిన పోలీసులు సాయికృష్ణే నిందితుడని తేల్చారు. దీంతో అతడిని అరెస్ట్ చేసిన జైలుకు తరలించారు. పెళ్లి చేసుకోవాలని అప్సర ఒత్తిడి చేయడంతోనే ఆమెను చంపినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.
గుడిలో మొదలైన వీరి పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో ఆమె గర్భం కూడా దాల్చగా.. పెళ్లి చేసుకోవాలని సాయికృష్ణపై ఒత్తడి తెచ్చింది. ఈ విషయం బయటపడితే తన పరువు పోతుందనే భయంతో ఆమెను దారుణంగా చంపి మ్యాన్ హోల్లో పడేశాడు. అయితే అప్సరకు గతంలో వివాహమైనట్లు పోలీసులు గుర్తించారు. కాగా అప్సర తన కొడుకుని ట్రాప్ చేసి ఉంటుందని నిందితుడి తండ్రి ఆరోపిస్తున్నారు. తన కొడుకు అమాయకుడని.. అప్సర బ్యాంక్ అకౌంట్లు పరిశీలిస్తే ఆమె కుటుంబానికి ఆదాయం ఎలా వస్తుందన్నది తెలుస్తుందని చెబుతున్నారు.