సిరిసిల్లలో గులాబీ రంగు కలకలం.. పింక్ కలర్ చీరలతో వచ్చిన మహిళలు..
Kiran | 30 Nov 2023 11:41 AM IST
X
X
సిరిసిల్లలో పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఓ పోలింగ్ బూత్ వద్ద దాదాపు 20 మంది మహిళలు గులాబీ రంగు చీరలు కట్టుకొని వచ్చారు. దీనిపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు ఓ పోలింగ్ కేంద్రం బయట ఏర్పాటుచేసిన బ్యాలెట్ నమూనాలో పోలింగ్ తేదీ తప్పుగా ముద్రించి ఉంది. అభ్యర్థుల గుర్తుల కింద ఎన్నికల సిబ్బంది పోలింగ్ తేదీ 30-11-2023కు బదులుగా 15-11-2023 ముద్రించారు. దీనిపై ఇండిపెండెంట్ అభ్యర్థి లగిశెట్టి శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తంచేశారు.
Updated : 30 Nov 2023 11:41 AM IST
Tags: telangana news telugu news assembly election 2023 telangana election 2023 telangana polling sircilla constituency polling pink color sarees ballet paper polling date independent candidate
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire