Home > తెలంగాణ > ఈ నెల 25న కాంగ్రెస్‌లోకి పొంగులేటి, జూపల్లి!

ఈ నెల 25న కాంగ్రెస్‌లోకి పొంగులేటి, జూపల్లి!

ఈ నెల 25న కాంగ్రెస్‌లోకి పొంగులేటి, జూపల్లి!
X

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికలకు మరో ఐదు నెలలే గడువే ఉండటంతో రాజకీయ నేతలంతా తమ స్థానాలను సర్దుబాటు చేసుకునే ప్రయత్నాలు స్పీడప్ చేశారు. ఈ క్రమంలో తమ లక్ష్యాలు, ప్రాధాన్యతలకు ప్రయార్టీ ఇస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి సస్పెండైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు తీసుకోబోయే నిర్ణయం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు.. తమ పార్టీలో చేరాలని ఆహ్వానించినా ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. బీజేపీ తరపున ఈటల రాజేందర్ బృందం, కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ టీం ఇటీవల పొంగులేటితో చర్చలు జరిపారు. అయినా.. ఆయన ఏ పార్టీ వైపు మెుగ్గు చూపలేదు.

అయితే.. తాజాగా రేవంత్‌ రెడ్డి సోషల్‌ మీడియా ఓ వార్తను తెగ వైరల్‌ చేస్తోంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు ఇద్దరూ ఈ నెల 25 వ తేదీన కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని.. పేర్కొంది. అదే రోజున ప్రియాంక గాంధీ… ఖమ్మం వస్తున్నారని.. అదే రోజున మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు కాంగ్రెస్‌ పార్టీలో చేరుతారని ప్రచారం చేస్తున్నారు.

కాంగ్రెస్ లో చేరాలంటే తమతో పాటు.. తమ అనుచరులకు కూడా టికెట్స్‌ ఇవ్వాలన్నది పొంగులేటి, జూపల్లిలు మొదటి నుంచీ చేస్తున్న డిమాండ్‌. ఈ షరతులకు రాహుల్‌ గాంధీ టీమ్‌ నుంచి సానుకూల స్పందన వచ్చినట్టు తెలుస్తోంది. పొంగులేటి, జూపల్లి ఇద్దరికీ టికెట్స్‌ ఇవ్వడంతోపాటు.. వాళ్ల అనుచరులకు టికెట్ల విషయంలో ప్రాధాన్యత ఇస్తున్నట్టు సమాచారం.

Updated : 6 Jun 2023 12:56 PM IST
Tags:    
Next Story
Share it
Top