బీజేపీకి షాక్.. కోమటిరెడ్డితో పొంగులేటి, జూపల్లి భేటీ..
X
రాష్ట్రంలో కాంగ్రెస్ దూకుడు మీదుంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా.. ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలను ఆహ్వానిస్తూ ముందుకు సాగుతోంది. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలో గతంలో పార్టీని వీడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి సొంతగూటికి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని రాజగోపాల్ రెడ్డిని వారు కోరారు. అయితే ఇప్పుడే పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకోలేనని రాజగోపాల్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి సైతం పార్టీలోకి రావాలని ఆహ్వానం పలికిన తరుణంలో ప్రస్తుతం జరిగిన ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
బీజేపీ నాయకత్వంపై రాజగోపాల్ రెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. బండి సంజయ్ ను పార్టీ అధ్యక్షుడి పదవి నుంచి తప్పించాలని ఈటలతో కలిసి ఆయన ఢిల్లీ వెళ్లి అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారు. అయితే అనుకున్నట్లుగానే బండి సంజయ్ను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిన హైకమాండ్.. కిషన్ రెడ్డిని కొత్త ప్రెసిడెంట్గా నియమించింది. మరోవైపు ఈటలకు ఎన్నికల కమిటీ చైర్మన్గా బాధ్యతలను అప్పగించింది.