Home > తెలంగాణ > కొండను తవ్వి.. ఎలుకను కూడా పట్టుకోలేదు : పొంగులేటి

కొండను తవ్వి.. ఎలుకను కూడా పట్టుకోలేదు : పొంగులేటి

కొండను తవ్వి.. ఎలుకను కూడా పట్టుకోలేదు : పొంగులేటి
X

ఐటీ అధికారులు కొండను తవ్వి ఎలుకను కూడా పట్టుకోలేకపోయారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పొంగులేటి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. అయితే విచారణ నిమిత్తం హైదరాబాద్ రావాలని కుటుంబ సభ్యులకు ఐటీ అధికారులు సూచించారు. ఐటీ దాడులపై పొంగులేటి ఫైర్ అయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రపూరితంగా దాడులు నిర్వహించారని ఆరోపించారు. 30పైగా ప్రాంతాల్లో సోదాలు చేసిన ఏమీ దొరకలేదని చెప్పారు.

తాను ఇవాళ నామినేషన్ వేస్తున్నట్లు తెలిసే ఐటీ దాడులు జరిగాయని పొంగులేటి అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీలకు తగిన బుద్ధి చెప్తారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల ఇళ్లపైనే ఐటీ దాడులు ఎందుకు జరుగుతున్నాయని.. బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఇళ్లల్లో ఎందుకు జరుగుతలేవని నిలదీశారు. తన దగ్గర పనిచేస్తున్న ఉద్యోగులు సహా బంధువులపై మ్యాన్ హ్యాండలింగ్ చేశారని ఆరోపించారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. ఎవరికీ భయపడేది లేదని స్పష్టం చేశారు.


Updated : 9 Nov 2023 8:50 PM IST
Tags:    
Next Story
Share it
Top