Home > తెలంగాణ > షర్మిల చేరికపై పొంగులేటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

షర్మిల చేరికపై పొంగులేటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

షర్మిల చేరికపై పొంగులేటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరుతారని గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఈ అంశంపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏపీ సీఎం జగన్తో చర్చించిన్నట్లు వార్తలొచ్చాయి. ఈ వార్తలపై పొంగులేటి స్పందించారు. తాను జగన్ను కలవలేదని క్లారిటీ ఇచ్చారు. ఏపీ వెళ్లి సీఎంవో అధికారులను మాత్రమే కలిశానని.. వారితో తన కాంట్రాక్టులకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు తెలిపారు. జగన్ను కలిసి షర్మిల అంశంపై మాట్లాడినట్లు వచ్చిన వార్తల్లో ఎటువంటి నిజం లేదన్నారు.

షర్మిల చేరికపై పార్టీ పెద్దలు చూసుకుంటారని పొంగులేటి స్పష్టం చేశారు. షర్మిల మ్యాటర్ తన పరిధిలోనిది కాదన్నారు. మరోవైపు వైసీపీకి తెలంగాణ మీద ఎటువంటి ఆసక్తి లేదన్నారు. కాగా ఈ నెలాఖరున బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వలసల ఫ్లో మొదలవుతుందని చెప్పారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు పీసీసీ, ఏఐసీసీ నేతలతో టచ్లో ఉన్నారని తెలిపారు.

మోడీ సభను కేసీఆర్ బహిష్కరించారా లేక నటించారా అని పొంగులేటి ప్రశ్నించారు. నువ్వు కొట్టినట్టు చేయు.. నేను ఏడచ్చినట్టు చేస్తా అనేలా మోదీ, కేసీఆర్‌ల బంధం ఉందని విమర్శించారు. పాలమూరులో కాంగ్రెస్ సభ.. ఖమ్మం సభను మరిపించేలా ఉంటుందని చెప్పారు. కేసీఆర్ను గద్దెదించే వరకూ తమ పోరాటం కొసాగుతుందని స్పష్టం చేశారు.


Updated : 10 July 2023 4:59 PM IST
Tags:    
Next Story
Share it
Top