Home > తెలంగాణ > ఖాళీ ఉద్యోగాల భర్తీ.. సొంతిటి కల నెరవేరుస్తాం : పొంగులేటి

ఖాళీ ఉద్యోగాల భర్తీ.. సొంతిటి కల నెరవేరుస్తాం : పొంగులేటి

ఖాళీ ఉద్యోగాల భర్తీ.. సొంతిటి కల నెరవేరుస్తాం : పొంగులేటి
X

సింగరేణిలో ఎన్నికల సందడి నెలకొంది. ఈ నెల 27న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్నాయి. గెలుపే లక్ష్యంగా అధికార పార్టీ ప్రచారం నిర్వహిస్తోంది. ఈ క్రమంలో కొత్తగూడెంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులకు వరాలు ప్రకటించారు. కార్మకులకు ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి రూ. 20 లక్షల వడ్డీలేని రుణం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. సింగరేణి దినోత్సవం రోజున సెలవుగా ప్రకటిస్తామన్నారు. కార్మికులకు వైద్యం కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తామని చెప్పారు.

అదేవిధంగా సింగరేణిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని.. ఎలాంటి ఖర్చు లేకుండా కారుణ్య నియామకాలను చేపడతామని పొంగులేటి తెలిపారు. కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్మికులంతా ఐఎన్టీయూసీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అటు పెద్దపల్లిలో మంత్రి శ్రీధర్ బాబు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి హైపవర్ కమిటీ వేస్తామని చెప్పారు. కార్మికుల సొంతింటి కలను నెరవేరుస్తామని స్పష్టం చేశారు.

Updated : 25 Dec 2023 7:00 AM GMT
Tags:    
Next Story
Share it
Top