Home > తెలంగాణ > కాంగ్రెస్లోకి పొంగులేటి..ముహూర్తం ఫిక్స్..!

కాంగ్రెస్లోకి పొంగులేటి..ముహూర్తం ఫిక్స్..!

కాంగ్రెస్లోకి పొంగులేటి..ముహూర్తం ఫిక్స్..!
X

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరగనుండడంతో పార్టీలన్నీ దూకుడు పెంచాయి. ఇక బీఆర్ఎస్ నుంచి సస్పెండైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో చేరుతారన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ సస్పెన్స్కు తెరదించుతూ ఆయన కాంగ్రెస్లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన చేరే తేదీ కూడా ఫిక్స్ అయిందట.

అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ ఈ నెల 21న భారత్కు తిరిగిరానున్నారు. 22 తర్వాత రాహుల్తో పొంగులేటి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు భేటీ అవుతారని సమాచారం. ఇప్పటికే వారు రాహుల్తో జూమ్ మీటింగ్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ నెల 30న ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. ఆ సభకు రాహుల్ లేదా ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా వచ్చే అవకాశం ఉంది. ఈ సభలోనే పొంగులేటి అండ్ టీం కాంగ్రెస్ లో చేరుతారని తెలుస్తోంది.

ఆ తర్వాత పాలమూరు జిల్లాలో మరో సభ నిర్వహించనున్నారు. ఈ సభలో జూపల్లి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి సహా పలువురు నేతలు కాంగ్రెస్లో చేరుతారు. కాగా మొదట పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరుతారనే ప్రచారం జరిగింది. ఆ తరువాత షర్మిల పార్టీలో చేరుతారని వార్తలు వచ్చాయి. కానీ బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే సత్తా ఉన్న పార్టీలోనే చేరుతామని చెబుతూ వస్తున్నా.. పొంగులేటి చివరకు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారు.

Updated : 17 Jun 2023 4:09 PM IST
Tags:    
Next Story
Share it
Top