Home > తెలంగాణ > Kishan Reddy : ఈ బడ్జెట్‌తో పేదలకు నష్టం: కిషన్ రెడ్డి

Kishan Reddy : ఈ బడ్జెట్‌తో పేదలకు నష్టం: కిషన్ రెడ్డి

Kishan Reddy : ఈ బడ్జెట్‌తో పేదలకు నష్టం: కిషన్ రెడ్డి
X

కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పేదలకు నష్టం కలిగించే విధంగా ఉందన్నారు. ఇందులో అన్ని రంగాలకు అన్యాయం చేశారని..కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర సర్కారు దారి మళ్లిస్తున్నారని అని కిషన్ రెడ్డి తెలిపారు.

కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై బడ్జెట్‌లో ఏమీ చెప్పలేదని ఆరోపించారు. వ్యవసాయానికి రూ.19,746 కోట్లు మాత్రమే కేటాయించారని, రైతు భరోసా, రుణమాఫీ, పంట బీమాకు నిధుల ప్రస్తావనే లేదని అన్నారు. రైతుబీమా, వడ్డీ లేని రుణాల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీకి ఎన్ని నిధులు కేటాయించారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలకు సంబంధించి కేటాయింపులు జరపలేదని, సాగునీటి ప్రాజెక్టుల కోసం బడ్జెట్‌లో కేటాయించిన రూ.28 వేల కోట్లు సరిపోవని అన్నారు. బీసీల సంక్షేమానికి కేవలం రూ.8 వేల కోట్లు మాత్రమే కేటాయించారని, దీని ద్వారా బీసీలను మోసం చేశారని కిషన్ రెడ్డి విమర్శించారుబడ్జెట్‌ను చూస్తే ఆరు గ్యారెంటీల్లో రైతులకు ఇచ్చిన గ్యారెంటీ అమలు కానట్లేనని కిషన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో అసలు పస లేదని ఆరోపించారు. ఇదొక చెత్త బడ్జెట్ అని తీవ్ర విమర్శలు చేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలొ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను శ్రీకారం చుట్టారు. రాంగోపాల్ పేట డివిజన్ పరిధిలో స్థానిక కార్పొరేటర్ చీర సుచిత్రతో కలిసి పర్యటించారు. పలు కాలనీలో వివిధ అభివృద్ధి పనులను పవర్ బోర్వెల్‌లను ప్రారంభించారు.

Updated : 11 Feb 2024 9:24 AM GMT
Tags:    
Next Story
Share it
Top