Home > తెలంగాణ > Yellow Alert: మూడు రోజుల పాటు భారీ వర్షాలు..

Yellow Alert: మూడు రోజుల పాటు భారీ వర్షాలు..

Yellow Alert: మూడు రోజుల పాటు భారీ వర్షాలు..
X

రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఇవాళ, రేపు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. శుక్రవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.

శుక్రవారం నుంచి శనివారం వరకు ఆసిఫాబాద్‌, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగామ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంటూ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. గడిచిన 24 గంటల్లో నిర్మల్‌, నిజామాబాద్‌, మెదక్‌, సంగారెడ్డి, సిద్దిపేట, మహబూబాబాద్‌, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయని తెలిపింది.

Updated : 14 July 2023 11:07 AM IST
Tags:    
author-thhumb

Veerendra Prasad

వీరేందర్ మైక్ టీవీ వెబ్‌సైట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌(సబ్ ఎడిటర్)గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో(V6, T News) రాజకీయం, లైఫ్ స్టైల్, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.


Next Story
Share it
Top