బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో వర్షాలు!!
X
ఏపీ తీరంలోని కొమరెన్ ప్రాంతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు నిన్న తూర్పుగాలులకు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఏర్పడిన అల్పపీడనం నేడు బలహీనపడిందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వైపు తూర్పు, ఈశాన్య దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుంచి కొన్ని చోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు.
తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. నేటి నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. హైదరాబాద్ లో అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్నాయి. బండంపేట్, చంద్రాయణ గుట్ట, మాదాపూర్ పలుచోట్ల వాన జల్లు కురుస్తుంది. హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 21 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. తూర్పు దిశలో గంటకు 8 నుంచి 10 కి.మీ వేగంతో ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 21.1 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ శాతం 79గా నమోదైంది.