Home > తెలంగాణ > కరెంట్ షాక్ అంటే ఇదే..ఓ ఇంటికి రూ.7.97 లక్షల కరెంటు బిల్

కరెంట్ షాక్ అంటే ఇదే..ఓ ఇంటికి రూ.7.97 లక్షల కరెంటు బిల్

కరెంట్ షాక్ అంటే ఇదే..ఓ ఇంటికి రూ.7.97 లక్షల కరెంటు బిల్
X

సాధారణంగా ఓ ఇంటికి నెల రోజులకు ఎంత లేదన్నా 500 నుంచి 1000 రూపాయల వరకు కరెంటు బిల్ వస్తుంది. ఇక వేసవి సీజన్‎లో ఏసీలు వంటివి వాడతాం కాబట్టి అటు ఇటు చూసుకున్నా ఎంత లేదన్నా 5వేలకు మించి కరెంట్ బిల్ రాదు. కానీ ఉప్పల్ పరిధిలో ఉన్న ఓ ఇంటికి మాత్రం 7,97,576 రూపాయల కరెంట్ బిల్ వచ్చింది. ఇది చూసి ఆ ఇంటి యజమాని మైండ్ బ్లాక్ అయింది. ఎన్నడూ ఊహించని విధంగా కరెంట్ బిల్ రావడంతో ఒక్కారిగా గుండె జారిపోయినంత పనైంది. అసలు విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకుంది.

వివరాల్లోకి వెళ్తే ఉప్పల్‎లోని హైకోర్టు కాలనీలోని నివాసముంటున్న పాశం శ్రీదేవి ఇంటికి రెండు కరెంట్ మీటర్లు ఉన్నాయి. పాశం శ్రీదేవి తల్లి పై ఫ్లోర్ లో ఉంటున్నారు. గ్రౌండ్ ఫ్లోర్‎ చాలా రోజుల నుంచి ఖాళీగానే ఉంటోంది. ఆ పోర్షన్‎కి ప్రతి నెల 150 నుంచి 300 లోపు కరెంట్ బిల్లు వచ్చేది. అయితే మే నెలకి సంబంధించిన కరెంట్ బిల్లు చూసి ఆ ఇంటి యజమాని గుండె ఆగినంత పనైంది. ఏకంగా మే నెలలో కరెంటు బిల్లు రూ.7,97,576 రావడంతో వెంటనే విద్యుత్ అధికారులని సంప్రదించారు. మీటర్ జంపింగ్ అయ్యిందని కొత్త మీటర్ పెట్టించుకోవాలని చెప్పడంతో ఉప్పల్‎లోని విద్యుత్ కార్యాలయానికి వెళ్లి డీడీలను కట్టి మీటర్ మార్పించారు.

అయితే అడ్డగోలుగా కరెంటు బిల్లులు వేసి, తప్పు తమ దగ్గర పెట్టుకుని సామాన్యులను ఇబ్బందులు పెడుతున్నారని శ్రీదేవీ తల్లి ఆండాలు వాపోయారు. విద్యుత్ కార్యాలయంలో ఆపీసర్లు తమను పెద్దగా పట్టించుకోవడం లేదని గంటల కొద్దీ సమయాన్ని వృధా చేస్తున్నారని ఆరోపించారు. తమ లాంటి చాలా మంది బాధితులు కార్యాలయం ముందు క్యూలు కట్టారని చెబుతున్నారు.

Updated : 20 Jun 2023 2:56 PM IST
Tags:    
Next Story
Share it
Top