Home > తెలంగాణ > ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.. అధికారులతో టచ్లోకి ప్రభాకర్ రావు

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.. అధికారులతో టచ్లోకి ప్రభాకర్ రావు

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.. అధికారులతో టచ్లోకి ప్రభాకర్ రావు
X

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజు రోజుకు కొత్త ట్విస్ట్ లు బయటపడుతున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావు, మరో ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులు భుజంగరావు, తిరుపతన్నను అరెస్ట్ చేశారుర. ప్రణీత్ రావు కస్టడీ ద్వారా కీలక విషయాలను బయటపడటంతో దర్యాప్తులో దూకుడు పెరిగింది. ఇందులో ఏ1గా ఉన్న ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ టి. ప్రభాకర్ రావు కోసం పోలీసులు వెతకడం మొదలుపెట్టారు. ఆయన అమెరికాలో ఉన్నారని తెలియడంతో.. పోలీసులకు ఒకింత కష్టమైంది. అయితే ఈ కేసులో బిగ్ అప్ డేట్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభాకర్ రావు పోలీస్ ఉన్నతాధికారులతో టచ్ లోకి వచ్చినట్లు సమాచారం. అమెరికా నుంచి ఓ ఉన్నతాధికారికి ప్రభాకర్ రావు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది.

తాను క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు వచ్చానని.. జూన్ లేదా జులైలో తిరిగి హైదరాబాద్ వస్తానని ఫోన్‌లో చెప్పారట. గత ప్రభుత్వం చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని, తన ఇంట్లో సోదాలు జరపడం ఆపాలని కోరారు. అయితే దీనికి స్పందించిన అధికారి.. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ప్రభుత్వానికి మెయిల్ పెట్టండని బదులిచ్చారు. కాగా ఈ కేసులో ప్రభాకర్ రావుపై కేసు నమోదైన తర్వాత.. అమెరికా వెళ్లిపోయారు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ప్రణీత్ రావు హార్డ్ డిస్క్ లను ధ్వంసం చేశారు. ప్రస్తుతం వాటిని రికవరీ చేసిన పోలీసులు, కొంత సమాచారాన్ని రిట్రీవ్ చేశారు.

Updated : 25 March 2024 10:42 AM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top