మందకృష్ణ నన్ను రూ.25 కోట్లు డిమాండ్ చేశాడు.. కేఏ పాల్
X
ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. తన పార్టీలో చేరమంటే రూ.25 కోట్లు డిమాండ్ చేశారని కేఏ పాల్ అన్నారు. మందకృష్ణ మోడీకి అమ్ముడు పోయాడని.... ఒకప్పుడు మోడీని ఘోరమైన తిట్లు తిట్టిన వ్యక్తి.. ఇప్పుడు మోడీ దేవుడు అని అంటున్నారని మండిపడ్డారు. పెరేడ్ గ్రౌండ్‌లో సభ పెట్టడానికి మందకృష్ణకు 72కోట్లు ముట్టాయని అన్నారు. ఒక ఎంపీ టికెట్ ఇస్తారని మందకృష్ణ మాదిగ అమ్ముడు పోయారని తెలిపారు.
ఈ దేశాన్ని రక్షించాలంటే కేఏ పాల్ మాత్రమే ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత అనివితి జరుగుతున్న దేశం ఇండియాగా మారిందన్నారు. నరేంద్ర మోడీ బీసీ కాదు.. నా శిష్యుడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోడీ సర్టిఫికెట్లు అన్ని డూప్లికేట్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోడీకి కేఏ పాల్ భయపడడు అన్నారు. అదానీ అప్పులను మోడీ మాఫీ చేశారని మండిపడ్డారు.
ఈ ఎన్నికల్లో చెన్నూరు, జుక్కల్, వేములవాడ, ఉప్పల్, యకత్పురతో పాటు 13 సెగ్మెంట్లలో తన అభ్యర్థులు ఉన్నారని తెలిపారు. తమ పార్టీకి సింబల్ ఇవ్వనందుకు రేపు తెలంగాణ హై కోర్టుకు వెళ్తున్నట్లు ప్రకటించారు. దేశంలో ప్రజాస్వామ్యం కూని అయిందని మండిపడ్డారు. కుటుంబ పాలన వద్దని అన్నారు. 30న ఓట్లు వేయకుండా ఇంట్లో కూర్చోవాలని సూచించారు. మాదిగలకు మోడీ ఇన్ని రోజులకు చేయని న్యాయం ఇప్పుడు చేస్తారా? అని ప్రశ్నించారు.