Home > తెలంగాణ > ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన కేఏ పాల్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన కేఏ పాల్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన కేఏ పాల్
X

తెలంగాణ ముఖ్యమంత్రిని రేవంత్‌ రెడ్డిని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మర్యాద పూర్వకంగా కలిశారు. సోమవారం హైదరాబాద్​ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో కేఏ పాల్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. జనవరి 30న జరిగే ప్రపంచ శాంతి సదస్సుకు సీఎం రేవంత్‌ రెడ్డిని తాను ఆహ్వానించానని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు కేఏ పాల్ తెలిపారు. సీఎంని తాను కలిసినట్లు కేఏ పాల్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపారు. గ్లోబ‌ల్ పీస్ స‌ద‌స్సుకు కావాల్సిన అనుమ‌తుల‌ను మంజూరు చేయాల్సిందిగా సీఎంను ఆయన కోరారు. ప్రస్తుతం రేవంత్‌ రెడ్డి, కేఏ పాల్ భేటీకి సంబందించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ ప్ర‌పంచ శాంతి స‌ద‌స్సుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు ప‌లువురు నాయ‌కుల‌ను ఆహ్వానించిన‌ట్లు కేఏ పాల్ పేర్కొన్నారు. ఈ స‌ద‌స్సుకు ప‌లు దేశాల నుంచి వేల మంది హాజ‌ర‌వుతున్న‌ట్లు పాల్ వెల్ల‌డించారు.మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి జ్వ‌రం బారిన పడినట్లు తెలుస్తోంది. గ‌త మూడు రోజుల నుంచి జ్వ‌రం, గొంతు నొప్పితో సీఎం బాధ‌ప‌డుతున్న‌ట్లు స‌మాచారం. ఇంటి వ‌ద్దే ఫ్యామిలీ డాక్ట‌ర్ ఆయనను ప‌రీక్షించి.. మందులు ఇచ్చినట్లు తెలుస్తోంది. జలుబు, దగ్గుతో కూడా ఇబ్బంది పడుతున్న సీఎం​కు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం.

Updated : 25 Dec 2023 8:09 AM GMT
Tags:    
Next Story
Share it
Top