Home > తెలంగాణ > పొంగులేటి మా పార్టీలోకి వస్తే.. డిప్యూటీ సీఎం ఆయనే: కేఏ పాల్

పొంగులేటి మా పార్టీలోకి వస్తే.. డిప్యూటీ సీఎం ఆయనే: కేఏ పాల్

'అమిత్ షాను ప్రధానమంత్రిని చేయాలి'

పొంగులేటి మా పార్టీలోకి వస్తే.. డిప్యూటీ సీఎం ఆయనే: కేఏ పాల్
X




మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తమ పార్టీలో చేరాలని ఆహ్వానించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్. తమ పార్టీలోకి వస్తే.. గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని వెల్లడించారు. ఆదివారం ఖమ్మంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు పాల్. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒంటరిగా పోటీ చేస్తే బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఆయనకు ఓటేయరని అన్నారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలో 10 సీట్లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోరుకున్న వ్యక్తులకు ఇస్తామని.. ఆయన తమ పార్టీలో చేరాలని కోరారు. గెలిచిన తర్వాత తాను ముఖ్యమంత్రిగా ఆయన ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. తనకు కుల, మత పట్టింపులు లేవని అన్నారు.

మరోవైపు, ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం గురించి మాట్లాడుతూ... 40 ఏళ్లలో ఇలాంటి రైలు ప్రమాదం జరగలేదని.. రైలు ప్రమాదంపై బాధ్యత వహించి ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత హోం మంత్రిగా ఉన్న అమిత్ షా తర్వాతి ప్రధాని కావాలన్నారు. వందల మంది ప్రాణాలు బలయ్యాయని.. ఇలాంటి దుస్థితిలో దేశం ఉన్నదని అన్నారు.

చంద్రబాబు ఢిల్లీ టూర్ పెద్ద డ్రామా అని విమర్శించారు. ఐదేళ్లు చంద్రబాబుకు అమిత్ షా పర్మిషన్ ఇవ్వలేదన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి చనిపోవడానికి కారణం చంద్రబాబునేనని ఆరోపించారు. చంద్రబాబు ఇక తప్పించుకోలేడని.. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ జాగ్రత్తగా ఉండాలని అన్నారు.




Updated : 5 Jun 2023 3:10 AM GMT
Tags:    
Next Story
Share it
Top