ప్రజాదర్భార్ కాదు ప్రజా వాణి.. ఇక వారంలో రెండ్రోజులే..
X
జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ పేరు మార్చారు. ఇకపై ప్రజావాణిగా పిలవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు ప్రజావాణి ఎప్పుడు నిర్వహించాలన్న దానిపైనా నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి వారంలో రెండు రోజులు మాత్రమే ప్రజావాణి నిర్వహించనున్నారు. మంగళ, శుక్రవారాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ప్రజావాణి నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఉదయం 10గంటల్లోపు ప్రజాభవన్ కు చేరుకున్న వారికి మాత్రమే అవకాశమివ్వనున్నారు. దివ్యాంగులు, మహిళల కోసం ప్రత్యేక క్యూలైన్లతో పాటు ప్రజావాణికి వచ్చే వారి కోసం తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించాలని సీఎం రేవంత్ ఆదేశించారు.
ప్రజావాణిలో ఇచ్చే వినతులకు సంబంధించి ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది. ప్రజలు ఇచ్చే వినతులపై వారి పూర్తి అడ్రస్, సెల్ ఫోన్ నెంబర్ రాయాలని, అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు. దరఖాస్తుదారులు పూర్తి వివరాలు ఇస్తే సమస్య పరిష్కారం సులువవుతుందని అన్నారు.