బీజేపీ చేసేది తప్పు.. తెలంగాణలో గెలిచేది ఆ పార్టీనే
X
ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే అని.. ప్రజలంతా ఆ పార్టీ వైపే ఉన్నారని చెప్పుకొచ్చారు. సీఎం కేసీఆర్ విజన్ తనకు నచ్చుతుందని, ఆయన గొప్ప మానవతావాది అని కొనియాడారు. కేసీఆర్ ఆలోచన, వాధానాలు చాలా గొప్పవని తెలిపారు. కేసీఆర్ పనితీరు నచ్చడం, ఆయనకు దగ్గరగా ఉన్నంత మాత్రాన తాను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను, ఆ పార్టీకి చెందిన వ్యాక్తి కాదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధికి ప్రజలు పట్టంగట్టి.. ఆ పార్టీని గెలిపిస్తారని జోస్యం చెప్పారు. పదేళ్లు వరుసగా అధికారంలో ఉండటంతో.. ఇంకొకరికి అవకాశం ఇద్దామనుకోవడం సహజమని, కానీ కేసీఆర్ కు ప్రత్యామ్నాయంగా తెలంగాణలో ఇంకొకరు లేరని చెప్పుకొచ్చారు.
గతంలో ఉన్నట్లుగా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు లేదని.. కేసీఆర్ మాటల్లో పస తగ్గిందని అన్నారు. తెలంగాణకు న్యాయం కోసం ఉద్యమం జరిగిందని.. దాని ప్రకారం రాష్ట్రం ఏర్పడ్డాక ఏం జరిగిందో చూడాలని చెప్పారు. బీఆర్ఎస్ లో కుటుంబ పాలన కాదు.. వారికి అర్హత ఉందా లేదా అన్నది ప్రజలు చూడాలకి ప్రకాష్ రాజ్ కోరారు. ఈ నేపథ్యంలో బీజేపీపై విరుచుకుపడ్డారు. తన ఐడియాలజీకి బీజేపీకి చాలా దూరం ఉందని, సమాజంలో భిన్నాభిప్రాయాలు ఉండాలని అన్నారు. దేశంలో ఏం జరిగినా అది తమవల్లే అనే భావన నుంచి బీజేపీ నాయకులు బయటికి రావాలని సూచించారు. అయోధ్యలో రామమందిరం నిర్మించడంపై బీజేపీ నేతలు రాజకీయం చేయడం సరికాదని ప్రకాష్ రాజ్ అభిప్రాయపడ్డారు.